కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (83) పరమపదించడంపై స్వామి పరిపూర్ణానంద దిగ్భ్రాంతి

  • జయేంద్ర సరస్వతి ఈ లోకానికి చేసిన మేలు అనుపమానం 
  • ఆధ్యాత్మిక తపోలోకంలో ఆయనో ధ్రువతార
  • సంస్కరణలను చేసి చూపించి స‌మాజానికి సందేశం ఇచ్చారు
కొంతకాలంగా శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతోన్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (83)  కాంచీపురంలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప‌ర‌మ‌ప‌దించిన విష‌యం తెలిసిందే. ఆయన శివైక్యం చెందడంపై రాష్ట్రీయ హిందూ సేన వ్య‌వ‌స్థాప‌కుడు స్వామి పరిపూర్ణానంద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి ఈ లోకానికి చేసిన మేలు అనుపమానమని అన్నారు. ఆధ్యాత్మిక తపోలోకంలో ఓ ధ్రువతారగా ఆయన మన అందరికీ తెలుసని అన్నారు.

జయేంద్ర సరస్వతి ఈ సమాజానికి చేసిన సేవ, సంస్కరణలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌ని తెలిపారు. ఆయ‌న ఎన్నో సంస్కరణలను చేసి చూపించి స‌మాజానికి సందేశం ఇచ్చార‌ని అన్నారు. ఓ సంఘ సంస్క‌ర్త‌గా ప‌ని చేశార‌ని తెలిపారు. ద‌ళితులతో స‌మావేశాలు ఏర్పాటు చేసి, మంచి స‌మాజాన్ని స్థాపించ‌డం కోసం కూడా కృషి చేశార‌ని అన్నారు. పూజ్యులు జయేంద్రసరస్వతి శివైక్యం చెందార‌ని అన్నారు.
Go Back to Shorts
paripoornananda
jayendra saraswathi
Hyderabad

More Telugu News